: రేపు ఢిల్లీకి వెళ్లనున్న నారా లోకేశ్
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రేపు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఆయన ఉపాధిహామీ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నరేంద్ర సింగ్ తోమర్‌తో చర్చించనున్నారు. ఆ పథకం కింద ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 2,207 నివాస ప్రాంతాలకు రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని ఆయన కోరతారు.