: భారత్ తో యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్: చైనా మీడియా రెచ్చగొట్టే కథనం
భారత్, చైనా మధ్య రాజుకున్న డోక్లాం వివాదంపై చైనా మీడియా మరింత రెచ్చగొట్టే విధంగా కథనాన్ని ప్రచురించింది. భారత్‌తో యుద్ధం చేయడానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని రాసుకొచ్చింది. ఆ దేశానికి చెందిన ఓ ఉన్నతాధికారి కూడా తాజాగా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. డోక్లామ్ సమస్య పరిష్కారం కోసం చర్చలు జరిగే అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. జరగబోయే పరిణామాలకు భారత్ పూర్తి బాధ్యత వహించాలని చైనా మీడియా పేర్కొంది. ఓ పక్క శాంతి చర్చల ద్వారానే పరిష్కారం అని చెబుతోన్న చైనా మరోపక్క యుద్ధానికి సిద్ధమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది.