: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లలోనూ ఆధార్ తప్పనిసరి!
హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం డి.బ్లాక్లో ఈ రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తమ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. తెలంగాణలో వాహనాల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లలో ఆధార్ నమోదు తప్పనిసరి చేయాలని ఆదేశించారు. అలాగే వాహన యాజమాన్య హక్కుల బదిలీ సమస్యలపై కూడా ఆయన పలు సూచనలు చేశారు. ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి, వాహనాల క్రయవిక్రయదార్లకు అవగాహన కల్పించాలని ఆయన సంబంధిత అధికారులకు తెలిపారు.