: పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ ను తిరిగి సొంతం చేసుకోవాలనేదే అందరి కోరిక: పార్లమెంటులో అరుణ్ జైట్లీ


1962లో చైనాతో జరిగిన యుద్ధం నుంచి ఎంతో నేర్చుకున్నామని కేంద్ర రక్షణమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మన భద్రతా బలగాలు 1965, 1971లలో జరిగిన యుద్ధాల ద్వారా మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్ లోని భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడని తెలిపారు. మన దేశ భద్రతను కాపాడేందుకు సమర్థవంతమైన భద్రతాబలగాలు మనకు ఉన్నాయని ఆయన అన్నారు. సమస్య తూర్పు నుంచి ఎదురైనా, పడమర నుంచి వచ్చినా సమర్థవంతంగా తిప్పికొట్టగలమని చెప్పారు. క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News