: ఎవరిపని వాళ్లు చేసుకోవాలి... మా పనులు మేం చేసుకుంటున్నాం!: సంచలన వ్యాఖ్యలు చేసిన కథానాయిక కాజల్


ప్రజలు ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని కాజల్ అందరికీ హితవు పలికింది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్ సందర్భంగా విజయవాడలో మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో తన సహ నటులంతా చాలా మంచివారని, ఎవరికీ ఎలాంటి అలవాట్లు లేవని చెప్పింది. తామంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని, ప్రజలు కూడా వారి పనులు వారు చేసుకుంటే మంచిదని హితవు పలికింది. దీనిపై రానా మాట్లాడుతూ, ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా సినీ పరిశ్రమ దాని ప్రయాణం అది చేస్తుందని చెప్పాడు. అయితే డ్రగ్స్ వంటివి ప్రోత్సహించడం ప్రమాదకరమని, తన వరకు తాను నిబద్ధత గా సినిమాల్లో నటిస్తుంటానని చెప్పాడు. ఈ సినిమా మంచి కథతో ముందుకు వస్తోందని, దానిని ఆదరించాలని రానా సూచించాడు. 

  • Loading...

More Telugu News