: హైదరాబాద్ లో నమోదైన వర్షపాతం వివరాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గత అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షాల ధాటికి ఈ రోజు ఉదయం నుంచి వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు చోట్ల రోడ్లపైనే నీళ్లు నిలిచాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే... మల్కాజ్ గిరి - 1.7 సెం.మీ, ఆసిఫ్ నగర్ - 1.7 సెం.మీ, కుత్బుల్లాపూర్ - 1.6 సెం.మీ, తిరుమలగిరి - 1.5 సెం.మీ, అంబర్ పేట్ - 4.8 సెం.మీ, నారాయణగూడ - 3.4 సెం.మీ, నాంపల్లి - 3.2 సెం.మీ, ఎల్బీనగర్ - 3.1 సెం.మీ, ఖైరతాబాద్ - 1.5 సెం.మీ గా ఉన్నాయి.