: దిలీప్ జీ బాగున్నారు.. ఇక డిశ్చార్జ్ చేస్తారని చూస్తున్నా: సైరా భాను


డీహైడ్రేషన్, ఇతర కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందిన అలనాటి బాలీవుడ్ హీరో దీలీప్ కుమార్ కోలుకున్నారు. తన భర్త పూర్తిగా కోలుకున్నారని ఆయన భార్య సైరా భాను చెప్పారు. ఈ రోజు డాక్టర్లు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని తాను ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 11న బ్రిటీష్ పాలనలో ఉన్న పెషావర్ (ఖైబర్ ఫఖ్తుంక్వా, పాకిస్థాన్)లో జన్మించారు. 1944లో తెరంగేట్రం చేసిన దిలీప్ కుమార్ దాదాపు 54 ఏళ్ల పాటు సినీ తెరపై కనిపించారు.

  • Loading...

More Telugu News