: బంతి నేరుగా వికెట్లను తాకినా బ్యాట్స్ మేన్ అవుట్ కాలేదు... ఫోర్ మాత్రం వచ్చింది...వీడియో చూడండి!


కరీబియన్ లీగ్ టీ20 టోర్నీలో పేసర్ వేసిన బంతి నేరుగా వికెట్లను తాకితే స్కోరుబోర్డులో నాలుగు పరుగులు చేరిన ఘటన ఆసక్తి రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...ట్రిన్‌ బాగో నైట్‌ రైడర్స్‌-సెయింట్‌ లూసియా స్టార్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులు చేసింది. అనంతరం సెయింట్ లూసియానా స్టార్స్ జట్టు 121 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించింది.

ఈ క్రమంలో ఏడవ ఓవర్ లో స్పిన్నర్‌ క్యారీ పెర్రీ బంతిని సంధించాడు. బంతిని బౌండరీ తరలించాలన్న బ్యాట్స్ మన్ వ్యూహాన్ని తల్లకిందులు చేస్తూ బంతి బ్యాట్, ప్యాడ్ మధ్యలోంచి దూసుకెళ్లి నేరుగా లెగ్ వికెట్ ను బలంగా రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో వికెట్ల లైట్లు వెలిగాయి. అయితే బంతి వికెట్ సైడ్ ను రాసుకుంటూ వెళ్లడంతో బెయిల్ కింద పడలేదు. బంతి మాత్రం కీపర్ కు అందకుండా నేరుగా వెళ్లి బౌండరీ లైన్ ను దాటింది. దీంతో బంతి నేరుగా వికెట్ ను తాకినా బెయిల్స్ పడకపోవడంతో బ్యాట్స్ మేన్ ఔట్ కాలేదు. దాంతో అంపైర్ ఫోర్ ఇచ్చాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ వీడియో చూడండి. 

  • Loading...

More Telugu News