: సీబీఐటీలో విద్యార్థులకు పలు సూచనలు చేసిన అకున్ సబర్వాల్


డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గండిపేటలోని సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఈరోజు మాదకద్రవ్యాల వ్యతిరేక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు అకున్ సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వీటి వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని చెప్పిన ఆయన... వీటి వాడకం వల్ల బంగారు భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో చెప్పారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్ ను వాడినా, వాడమని ప్రేరేపించినా తమకు సమాచారం అందించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News