: 'బిగ్ ఫైట్...గుడ్ ఫైట్...గుడ్ విన్' అంటూ అహ్మద్ పటేల్ ను అభినందించిన మమతా బెనర్జీ


గుజరాత్ రాజ్యసభ సభ్యుల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. అయితే అర్ధరాత్రి దాటాక ఫలితాలను వెల్లడిస్తూ, బీజేపీ సభ్యులు ఇద్దరు, కాంగ్రెస్ సభ్యుడు ఒకరు గెలిచినట్టుగా ఈసీ ప్రకటించడంతో హైడ్రామకు తెరపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విజయంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆమె అభినందనలు తెలుపుతూ బిగ్ ఫైట్, గుడ్ ఫైట్, బిగ్ విన్ అని అన్నారు. గుజరాత్‌ లో నిన్న జరిగిన మహా సమరంలో.. ధర్మయుద్ధంలో గొప్ప విజయం సాధించిన అహ్మద్‌ పటేల్‌ కు అభినందనలు అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. కాగా, సంఖ్యాబలం లేకున్నా బీజేపీ బల్వంత్ సింగ్ రాజ్ పుత్ ను బరిలో నిలపడం పట్ల వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

  • Loading...

More Telugu News