: వర్షాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు... వీడియో చూడండి!
భారీ వర్షంలోనూ వాహనాలకు మార్గదర్శకం చేస్తూ విధి నిర్వహణకే మొదటి ప్రాధాన్యం ఇచ్చిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. భారీ వర్షంలో తన విధులు నిర్వర్తిస్తూ అప్పుడే బ్రేక్ డౌన్ అయిన కారును వెనక నుంచి తోస్తూ సహాయం చేస్తున్న ఈ ట్రాఫిక్ పోలీసు వీడియోను ఢిల్లీకి చెందిన వ్యక్తి మంకన్ బమ్మి తన అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ట్రాఫిక్ పోలీసు పేరు కనుక్కోవడానికి ప్రయత్నించినా, తెలుసుకోలేకపోయానని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ వీడియో చూసిన వారంతా పోలీసు చేస్తున్న పని చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.