: 88 ఏళ్ల బామ్మ ఫ్యాషన్ ట్రెండ్స్‌కి ఇన్‌స్టాగ్రాం ఫిదా!
ఫ్యాషన్‌కి వయసుతో సంబంధం లేదని 88 ఏళ్ల బామ్మ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన తన ఫొటోలతో నిరూపిస్తోంది. రోజుకో రకమైన మోడ్రన్ డ్రెస్, గాగూల్స్ పెట్టుకుని తన అకౌంట్‌లో ఫొటోలు షేర్ చేసే ఈ బామ్మ పేరు మూన్ లిన్. తైవాన్‌కు చెందిన ఈ బామ్మ నుంచి ఇప్పుడు చాలా మంది యువతులు ఫ్యాషన్ పాటించడంలో సలహాలు తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఈమెకు 70,000ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే తైవాన్‌లో ఆమె ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన జీవితం 88వ ఏటనే ప్రారంభమైందని, ఇప్పుడు ఏం ధరించినా తనని ప్రశ్నించే వారు లేరని మూన్ లిన్ చెబుతోంది. అంతెందుకు, శరీరం మీద ముడతలు లేకపోయి ఉంటే రకరకాల టాటూలు వేసుకునేందుకు వెనకాడనని మూన్ లిన్ చాలా సార్లు చెప్పింది.