: అయోధ్య కేసులో షియా బోర్డు అఫిడవిట్‌ను స్వాగతించిన కేంద్రం
బాబ్రీమసీదు వివాదాస్పద స్థలానికి కొద్దిదూరంలో మసీదు నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టుకు షియా వక్ఫ్ బోర్డు సమర్పించిన అఫిడవిట్‌ను కేంద్రం స్వాగతించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ కేంద్రం తరఫున మీడియాకు తెలియజేశారు. `షియా బోర్డు జారీ చేసిన అఫిడవిట్ స్వాగత యోగ్యమైనది. ఏళ్ల తరబడి కోర్టులో మగ్గుతున్న ఈ వివాదం సద్దుమణగడంలో వారి అఫిడవిట్ కీలకపాత్ర పోషిస్తుంది` అని సంజీవ్ పేర్కొన్నారు. బాబ్రీ మసీదు షియా ముస్లింలకు చెందినది కాబట్టి ఈ కేసుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తామే తీసుకుంటామని షియా బోర్డు అఫిడవిట్‌లో తెలియజేసింది. రామజన్మభూమి ప్రదేశంలో మసీదు నిర్మించారన్న ఆగ్రహంతో 1992, డిసెంబర్ 6న హిందూకరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అప్పటి నుంచి ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.