: `క్విట్ ఏపీ` అని ఉద్యమించాల్సిన సమయమిది!: వైఎస్ జగన్ ట్వీట్
క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా భారతీయుడిగా తాను శాల్యూట్ చేస్తున్నట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. `75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్యమానికి భారతీయుడిగా శాల్యూట్ చేస్తున్నా! ఆ ఉద్యమం నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా- మోసగాళ్లారా, దోపిడీ పాలకులారా, ప్రజా వంచకులారా క్విట్ ఏపీ అని ఉద్యమించాల్సిన సమయం వచ్చింది` అని ఆయన ట్వీట్ చేశారు.