: తుపాను ధాటికి తిరిగిపడ్డ కార్లు... వీడియో చూడండి!
ప్రకృతి ప్రకోపానికి ఎంతటి భవనమైనా కూలిపోవాల్సిందే... అలాంటి తుపాను ధాటికి కార్లు ఒక లెక్క కాదు. అమెరికాలోని మేరీలాండ్‌లోని సాలిస్‌బరీ ప్రాంతంలో వచ్చిన తుపాను ధాటికి అక్కడి చెట్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడ వేగంగా వీస్తున్న గాలుల ధాటికి పార్క్ చేసిన కారు ఎగిరి పడిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఓ షాపింగ్‌మాల్ బయట ఉన్న కెమెరాలో తుపాను దెబ్బకు తిరిగిపడుతున్న కారు వీడియోను చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. సుడిగాలి తాకిడికి కారు రెండు మూడు సార్లు గాల్లోకి ఎగిరి పడటం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే మరి! మీరూ చూడండి!