: ఓ కార్యక్రమం ఆసాంతం సమంత చెయ్యిని విడిచిపెట్టని నాగ చైతన్య... ముచ్చట పడిపోయిన అభిమానులు!
నాగ చైతన్య, సమంత... టాలీవుడ్ సెలబ్రిటీ జంట. త్వరలోనే మూడు ముళ్లతో ఒకటి కానున్నారన్న సంగతి తెలిసిందే. వారి గురించి వచ్చే ప్రతి వార్తా అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రసార మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా, వారిద్దరూ కలసి ఓ కార్యక్రమంలో పాల్గొనగా, అది ముగిసేంత వరకూ సమంత చెయ్యిని నాగ చైతన్య వదిలి పెట్టలేదు.
'వూవెన్ ఫ్యాషన్ షో 2017' పేరిట ఓ షో జరుగగా, దానికి గెస్టులుగా శామ్, చైతూ హాజరయ్యారు. బ్లాక్ అండ్ వైట్ శారీ, పొడవైన వెండి లోలాకులతో సమంత, సెమీ ఫార్మల్ డ్రస్ లో నాగచైతన్య వచ్చి పక్కపక్కన కూర్చోగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సంప్రదాయ వస్త్ర ధారణలో ఫ్యాషన్ షోకు వచ్చి, ఆసాంతం ఒకరిని ఒకరు వదలకుండా ఉన్న వారి ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.