: ప్లీజ్.. ఉత్తర కొరియాను ఏమీ అనవద్దు: ట్రంప్ ను వేడుకుంటున్న స్టాక్ మార్కెట్లు


ఉత్తర కొరియా వరుసగా అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం, వాటిని అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, ఐరాస ఆంక్షల నేపథ్యంలో, పసిఫిక్ మహా సముద్రంలోని గువాం ద్వీపంపై అణుదాడి జరుపుతామని చేసిన ఉత్తర కొరియా ప్రకటన ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదేలు చేసింది. పలు దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఎన్నో కంపెనీలు పాతాళానికి దిగజారాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకుతనంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని స్టాక్ మార్కెట్లు అమెరికాను అభ్యర్థించాయి.

కాగా, ఈ ఉద్రిక్త పరిస్థితులు మంగళవారం నాటి యూఎస్ మార్కెట్ ను 0.2శాతం పడగొట్టాయి. నేటి ఆసియా మార్కెట్లలో నిక్కీ 1.34 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.1 శాతం, హాంగ్ సెంగ్ 0.8 శాతం, తైవాన్ వెయిటెండ్ 0.80 శాతం, కోస్పీ 0.82 శాతం, షాంగై కాంపోజిట్ 0.21 శాతం నష్టపోయాయి. నిఫ్టీ - 50 సూచిక కీలకమైన 9,950 పాయింట్ల స్థాయి వద్ద మద్దతు పొందడంలో విఫలం కాగా, సెన్సెక్స్ మరోమారు 32 వేల పరుగుల కిందకు దిగజారింది. ఉత్తర కొరియాకు ఔషధాలు ఎగుమతి చేస్తున్న ఫార్మా కంపెనీలు నేడు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News