: యాంకర్ సుమను బాయ్ కాట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్?


నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల విజయం తరువాత, హ్యాట్రిక్ పై కన్నేసిన జూనియర్ ఎన్టీఆర్ త్వరలో 'జై లవకుశ' రూపంలో రానున్న సంగతి తెలిసిందే. మామూలుగా వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ వివాదాలకు దూరంగా ఉంటాడు. ఇక హీరోయిన్ గా ప్రవేశించి ఆపై యాంకర్ గా స్థిరపడిన సుమ కనకాల కూడా వివాదాలకు దూరంగానే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, వీరిద్దరి మధ్య ఏదో వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది.

అందుకే తన చిత్రం ఫంక్షన్లకు సుమను ఎన్టీఆర్ దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో గొడవ పడినందునే సుమకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన సుమ భర్త రాజీవ్ తోనూ ఎన్టీఆర్ కు విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ విషయంలో నిజమెంతో తెలియదు కానీ, రాజీవ్, ఎన్టీఆర్ ల మధ్య వైరం ఉంటే, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల్లో కలసి నటించే వారు కాదు కదా? అన్నది కొందరి ప్రశ్న.

  • Loading...

More Telugu News