: కాలాపానీ లేదా కాశ్మీర్ లోకి వస్తే ఏం చేస్తారు?: చైనా సూటి ప్రశ్న


తమ భూ భాగంలో ఒక్క భారత సైనికుడు ఒక్క రోజున్నా అది తమ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసినట్టేనని, ఇప్పుడు చర్చలకు తాము అంగీకరిస్తే, దేశ ప్రజలు తమను అసమర్థులుగా భావిస్తారని చైనా విదేశాంగ శాఖ అధికారిణి వాంగ్ వెన్లీ అన్నారు. చైనాలోని భారత విలేకరుల బృందంతో సమావేశమైన ఆమె, భారత్ సైన్యం వెనక్కు మళ్లేంత వరకూ చర్చలకు అవకాశాలు లేవని స్పష్టం చేశారు. రెండు దేశాల చైనా దళాలూ ఒకేసారి డోక్లామ్ నుంచి తిరుగు ప్రయాణం కావాలన్న భారత ప్రతిపాదన తమకు సమ్మతం కాదని చెప్పిన ఆమె, ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతానికి లేదా కశ్మీర్‌ లోకి తమ సైనికులు చొరబడితే, ఇండియా ఏం చేయగలుగుతుందని ప్రశ్నించారు.

ఇక ఇండియాతో యుద్ధానికి చైనా సన్నాహకాలు చేస్తోందా? అన్న ప్రశ్నకు, భారత వైఖరిని బట్టి దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్రిక్తతలు చోటు చేసుకున్న డోక్లామ్ ప్రాంతం చైనాకు చెందినదేనని స్వయంగా భూటాన్ ఒప్పుకుందని, తమ భూ భాగంలోకి భారత సైన్యం చొచ్చుకు వచ్చిందని ఆరోపించారు. మూడు దేశాల సరిహద్దు ప్రాంతం అయినంత మాత్రాన తాము రహదారిని నిర్మిస్తుంటే అడ్డుతగిలే హక్కు భారత్ కు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News