: డిప్యూటీ కలెక్టర్‌గా నేడు పీవీ సింధు బాధ్యతల స్వీకరణ!
ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నేడు ఉద్యోగంలో చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింధు నేడు విజయవాడ సమీపంలోని గొల్లపూడికి రానున్నారు. ఏపీ భూ పరిపాలన (సీసీఎల్ఏ) కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ఉద్యోగంలో చేరనున్నారు. అనంతరం తాను ఉద్యోగంలో చేరుతున్నట్టు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ పునేఠాకు రిపోర్ట్ చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు తొలుత డిప్యూటీ కలెక్టర్‌కు సంబంధించి ప్రాథమికంగా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు.