: ఉప ఎన్నిక ప్రచారానికి జగన్ శ్రీకారం.. నేటి నుంచి మూడు రోజులపాటు నంద్యాలలో ప్రచారం
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. నంద్యాలలో నేటి నుంచి మూడు రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నంద్యాల మండలం రైతునగరం నుంచి ఆయన ప్రచారం ప్రారంభం అవుతుందని వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. రైతు నగరం నుంచి రామకృష్ణానగర్, కానాల, హైస్కూల్ కొట్టాలలో ప్రచారం తర్వాత గోస్పాడు మండలంలోని ఎం.చింతకుంట్ల, జూలేపల్లి, పసురపాడు, తేళ్లపురి గ్రామాల్లో జగన్ రోడ్‌షో నిర్వహిస్తారని రఘురాం పేర్కొన్నారు.