: హైదరాబాదులో మహిళ, ఆమె భర్తను చితకబాదిన రౌడీ షీటర్లు
హైదరాబాదులో ఓ మహిళపై రౌడీ షీటర్ అనుచరులు దాడికి దిగడం కలకలం రేపింది. హైదరాబాదులోని కణోజీ గూడలో ఒక మహిళపై స్థానిక రౌడీ షీటర్ అనుచరులు దాడికి దిగారు. దీనిని అడ్డుకునేందుకు ఆమె భర్త ప్రయత్నించగా, అతనిపై తీవ్ర స్థాయిలో దాడి చేసి, విపరీతంగా కొట్టారు. దీంతో బాధితులు ఆల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు.