: అవన్నీ పుకార్లు... మేమేమీ పోర్న్ సినిమా తీయలేదు: అజయ్ దేవగణ్
'బాద్షాహో' సినిమాలో అజయ్ దేవగణ్, ఇలియానా రెచ్చిపోయి నటించారని, రొమాంటిక్ సన్నివేశాల్లో అద్భుతమైన కెమిస్ట్రీ పండిందని, దీంతో చిత్రీకరణ పూర్తయిన తరువాత ఈ సినిమాను సెల్ఫ్ సెన్సార్ చేశారని బాలీవుడ్ లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై అజయ్ దేవగణ్ మండిపడ్డాడు. అలాంటి పుకార్లు ఎలా వస్తాయో? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అవన్నీ అబద్ధాలని స్పష్టం చేశాడు.
సెల్ఫ్ సెన్సార్ చేయడానికి తామేమీ పోర్న్ సినిమా తీయలేదని ఆయన ఘాటుగా సమాధానం చెప్పాడు. తాము ఏ కథనైతే అనుకున్నామో అదే కథను తీశామని చెప్పాడు. చిత్రీకరణ పూర్తైందని చెప్పిన ఆయన కాపీని సర్టిఫికేషన్ కోసం సీబీఎఫ్సీకి పంపనున్నామని చెప్పాడు.