: రోజా చేసిన వ్యాఖ్య‌లపై అఖిల ప్రియ ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటాం!: నన్నపనేని రాజకుమారి


ఆంధ్రప్ర‌దేశ్ మంత్రి భూమా అఖిల ప్రియ‌పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల ప‌ట్ల‌ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామ‌ని అన్నారు. చుడీదార్ వేసుకునే అఖిల ప్రియ వ‌స్త్రధార‌ణ‌పై రోజా ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డ‌మేంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. చుడీదార్‌లోనే మహిళలు నిండైన వస్త్రధారణతో కనిపిస్తారని, ఏ మహిళైనా అసభ్యకరంగా డ్రస్‌లు వేసుకుంటే మాత్ర‌మే విమర్శించవచ్చునని అన్నారు. త‌న‌పై రోజా చేసిన ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ అఖిల ప్రియ త‌మ‌కు ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. రోజా చేసిన వ్యాఖ్య‌లు చుడీదార్ వేసుకున్న మహిళలందరినీ విమర్శించినట్లే ఉన్నాయని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News