: అగ్రస్థానంలో నిలిచిన 'కత్తి మాస్టర్' మిస్టర్ జడేజాకి అభినందనలు: కోహ్లీ
ఈ రోజు ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బౌలర్, ఆల్ రౌండర్‌ల జాబితాలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జడేజాపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ విభిన్న రీతిలో ప్రశంసలు కురిపించాడు. జడేజా క్రీజులో ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ, సెంచరీ సాధించినప్పుడు తన బ్యాట్‌ని కత్తిలా తిప్పుతాడన్న విషయం తెలిసిందే. దాన్ని గుర్తు చేస్తూ కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు. అగ్రస్థానంలో నిలిచిన కత్తి మాస్టర్, మిస్టర్ జడేజాకి అభినందనలని ఆయన పేర్కొన్నాడు. చివరికి వెల్‌డన్ జడ్డూ అని అన్నాడు. ఇక ఇదే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన అశ్విన్‌కి కూడా కంగ్రాట్స్ అని పేర్కొన్నాడు.