: ఓ సంస్థతో రూ.100 కోట్ల భారీ డీల్‌ కుదుర్చుకున్న బాలీవుడ్ న‌టుడు హృతిక్‌ రోషన్‌!


క్యూర్‌.ఫిట్‌ అనే హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్ స్టార్ట‌ప్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవహరించడం కోసం బాలీవుడ్ న‌టుడు హృతిక్‌ రోషన్‌ రూ. 100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓ స్టార్ట‌ప్‌ సంస్థ ఇంత పెద్ద మొత్తం ఆఫర్‌ చేయడం ఇదే తొలిసారని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఆ సంస్థ‌తో క‌లిసి స‌ద‌రు బాలీవుడ్ హీరో ఐదేళ్లు పనిచేయనున్నాడు. త‌మ సంస్థలో భాగస్వామ్యం, పెట్టుబడి వంటి తదితర రూపాల్లో హృతిక్‌కి ఇంత మొత్తాన్ని ఆ సంస్థ‌ అందించనుంది. ఆ కంపెనీ కోసం హృతిక్ రోష‌న్ తన సొంత సంస్థ హెచ్‌ఆర్‌ఎక్స్‌ స్పెషలైజ్‌డ్‌ వర్క్‌అవుట్ ప్ర‌ణాళిక‌ను డిజైన్‌ చేశారు. 

  • Loading...

More Telugu News