: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పై రేఖా నాయక్ ఫిర్యాదు... ఆందోళన
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పై నిర్మల్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. రమేష్ రాథోడ్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె అనుచరులు నిర్మల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.