: ఇక చేనేత దుస్తులు ఆన్‌లైన్‌లో... తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఇండియా ఒప్పందం
చేనేత కార్మికులకు, వస్త్రాల తయారీదార్లకు తమ వంతు సహాయం చేయడానికి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ముందుకొచ్చింది. చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడానికి తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన `వోవెన్ 2017` ప్రదర్శనలో అమెజాన్ ఇండియా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని వారు ట్వీట్ ద్వారా తెలియజేశారు. అమెజాన్ ఇండియా ట్వీట్‌కు స్పందనగా మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. `ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగి చేనేత దుస్తులను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం` అని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు.