: రాజకీయాల కోసం ఇంత దిగజారాలా?: రోజాపై ఏపీ మహిళా కమిషన్ సభ్యుల విమర్శ
వైసీపీ ఎమ్మెల్యే రోజా చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఏపీ మహిళా కమిషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేగా ఉన్న రోజా మహిళలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. రాజకీయాల కోసం ఇంత దిగజారి ప్రవర్తించాలా? అని ప్రశ్నించారు. జబర్దస్త్ వేషాలతో మహిళల గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారని మహిళా కమిషన్ సభ్యులు రాజ్యలక్ష్మి, పర్వీన్ బాను, శ్రీవాణి అసహనం వ్యక్తం చేశారు.