: విడిపోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో విడిపోయిన వాళ్లకే తెలుస్తుంది!: బాలీవుడ్ ఐటెం గర్ల్ మలైకా


విడాకులు తీసుకున్న తన మాజీ భర్తతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అయితే అతను తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని బాలీవుడ్ ఐటెం బాంబ్ మలైకా అరోరా తెలిపింది. ఈ మధ్య విహారయాత్ర ముగించుకు వచ్చిన మలైకా అరోరా... కొన్ని విషయాలు రాత్రికి రాత్రే మారిపోవని తెలిపింది. అర్బాజ్ ఖాన్ తన కుమారుడికి తండ్రి అని తెలిపింది. తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పింది. అర్బాజ్ తన చెల్లెలు అమృతకు అన్నలా, తన తల్లిదండ్రులకు కొడుకులా ఉంటాడని చెప్పింది. తనకు మాత్రం అతనితో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పింది.

విడిపోవడం అన్నది ఎవరికీ ఇష్టం ఉండదని, అసలు విడిపోవాలని కూడా ఎవరూ కోరుకోరని చెప్పింది. అయితే విడిపోవడం ఎంత కష్టంగా ఉంటుందో వారికి మాత్రమే తెలుస్తుందని చెప్పింది. తమ ఇద్దరి మధ్య జరిగినవన్నీ అలాగే ఉండిపోవాలని ఆశిస్తున్నానని చెప్పింది. అయితే విడిపోవడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇతరులకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అర్బాజ్‌ ని కలిస్తే తన కుమారుడు సంతోషంగా ఉంటాడని, వాడి సంతోషమే తనకు ముఖ్యమని స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News