: ఎన్.రామ్ ని కలవడం ఎప్పుడూ ఆనందమే!: పుస్తకావిష్కరణ సభలో కేటీఆర్
ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు ఎన్. రామ్ రచించిన `వై స్కామ్స్ ఆర్ హియర్ టు స్టే` పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఆయనతో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్. రామ్ వంటి సమకాలీన రాజకీయ విశ్లేషకుడిని కలవడం అన్నది తనకు ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. పుస్తకావిష్కరణకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు.