: ‘గట్టిగా బదులిస్తాం’.. భారత్‌పై నోరు పారేసుకున్న పాకిస్థాన్ కొత్త విదేశాంగ శాఖ‌ మంత్రి


భారత్‌తో త‌మ దేశం సత్సంబంధాలు పెంచుకునే విష‌యంపై పాకిస్థాన్ కొత్త విదేశాంగ శాఖ‌ మంత్రి ఆసిఫ్ స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. చర్చల ద్వారా పరిష్కారాన్ని క‌నుగొనేందుకు త‌మ దేశం సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించారు. అయితే, తాము కశ్మీర్ విషయంలో వెన‌క్కిత‌గ్గ‌బోమ‌ని పేర్కొన్నారు. తాము భార‌త్‌తో సత్సంబంధాలు కొన‌సాగించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు ముందుకు రావ‌డం లేద‌ని అన్నారు. సింధునదీ జలాల పంపకంపై భార‌త్‌ అనవసర వివాదం తీసుకొస్తొందని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.

తాము భార‌త్‌తో మాత్ర‌మే కాకుండా ఆఫ్గనిస్థాన్‌తోనూ స‌త్సంబంధాలు కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. తమది మెతక దేశమని ఇతరులు భావిస్తే మాత్రం గట్టిగా జవాబు చెబుతామని ఆయ‌న‌ హెచ్చరించారు. త‌మ దేశంపై ఎలాంటి దాడులు జరిగినా తాము తిప్పికొట్ట‌గ‌ల‌మ‌ని చెప్పారు. త‌మ దేశంపై ఇత‌రులు చేస్తోన్న కుట్ర‌లు ఫ‌లించ‌బోవ‌ని అన్నారు. ఆసిఫ్ చేసిన‌ వ్యాఖ్యలను పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం తప్పుబడుతున్నారు. పాకిస్థాన్‌ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అందుకు సంబంధించిన మూలాలు పాక్‌లోనే ఉంటున్నాయ‌ని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News