: రాఖీ క‌ట్టుకున్నందుకు ఫేస్‌బుక్‌లో ఇర్ఫాన్‌పై మ‌రోసారి దాడి చేసిన మ‌త‌ఛాంద‌సులు


ముస్లిం మ‌తానికి చెందిన భార‌త క్రికెటర్లు సోష‌ల్ మీడియాలో పెడుతున్న ఫొటోల‌కు మ‌తం రంగు పుల‌మ‌డం ఈ మ‌ధ్య బాగా అల‌వాటైంది. ఇంత‌కుముందు త‌న భార్య‌తో క‌లిసి ఉన్న ఫొటోను పెట్టినందుకు ముస్లిం నెటిజన్లు ఇర్ఫాన్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించిన సంగ‌తి తెలిసిందే. నిన్న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా రాఖీ క‌ట్టుకుని ఇర్ఫాన్ షేర్ చేసిన ఫొటోకు ఈ ఛాంద‌స‌వాదులు మ‌తం రంగు పులిమారు. రాఖీ ముస్లిం సంప్రదాయం కాద‌ని, `నువ్వ‌స‌లు ముస్లింవేనా?` అని, `నీ తండ్రి నీకు ముస్లిం విలువ‌లు నేర్ప‌లేదా?` అని ఇర్ఫాన్‌పై కామెంట్లు కురిపించారు. గ‌తంలో సూర్య‌న‌మ‌స్కారం చేసినందుకు, త‌న కుమారుడితో క‌లిసి చెస్ ఆడినందుకు క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్‌పై కూడా ముస్లిం నెటిజ‌న్లు ఇలాగే విరుచుకుప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News