: రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొరటాల శివ!


ఎప్పుడూ సైలెంట్ గా ఉండే సినీ దర్శకుడు కొరటాల శివ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రోజురోజుకూ రాజకీయాలు మురికిమయంగా మారిపోతున్నాయని శివ కామెంట్ చేశారు. ఎన్నడూ లేనంత దారుణమైన స్థాయికి ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను దేవుడు కూడా కాపాడలేడని తెలిపారు. ఎవరికి వారు ప్రయత్నిస్తే తప్ప రాజకీయాలు బాగుపడవని అభిప్రాయపడ్డారు. కొరటాల వ్యాఖ్యల పట్ల చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

మరోవైపు, మహేష్ బాబుతో కొరటాల శివ 'భరత్ అనే నేను' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, కొరటాల శివ పొలిటికల్ పంచ్ ఇచ్చాడని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News