: నన్ను ఎందుకు కాల్చి చంపాలి?: జగన్ కు చంద్రబాబు ప్రశ్న
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపండంటూ వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు నిర్వహించింది. జగన్ దిష్టి బొమ్మలను కూడా పలు చోట్ల దగ్ధం చేశారు. మరోవైపు, జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. అసలు తననెందుకు చంపాలని ఆయన ప్రశ్నించారు. ఒక సీఎంను రోడ్డుపై కాల్చి చంపాలంటూ పిలుపునివ్వడం ఉన్మాద మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. జగన్ ఒక శాడిస్ట్ అని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చాలని చెప్పారు.