: స్వగ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో వెంకయ్యనాయుడు పూజలు
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత వెంకయ్యనాయుడు తన స్వగ్రామాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెం ఆయన స్వగ్రామం. ఇక్కడి శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకుని, పూజలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. `మా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని చవటపాలెం సందర్శించాను. అక్కడి శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పూజలు చేశాను` అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఊరిని, కన్నతల్లిని మరవకూడదని ఆయన తెలియజేశారు.