: నా జన్మదిన వేడుకలు చేయకండి.. హంగామా అసలు వద్దు!: అభిమానులకు అమితాబ్ విజ్ఞప్తి


తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ విన్నవించారు. తన మాటను కాదని ఎవరైనా వేడుకలను నిర్వహిస్తే... ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరూ కనుక్కోలేని ప్రాంతానికి వెళ్లిపోతానని హెచ్చరించారు. తన పుట్టినరోజున హంగామా చేయాలని ఎంతో మంది అభిమానులు భావిస్తుంటారని... అలాంటి ఆలోచనలను దయచేసి విరమించుకోవాలని కోరాడు. అక్టోబర్ 11న అమితాబ్ తన 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అమితాబ్ ప్రస్తుతం '102 నాటౌట్', 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాల్లో నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News