: హీరో నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరంటే...!
యంగ్ హీరో నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నిఖిల్ పెళ్లి కుదిరింది. తమ దగ్గర బంధువైన అమ్మాయినే నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. నిఖిల్ అర్ధాంగి కాబోతున్న అమ్మాయి పేరు తేజస్విని. ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె ఆమె. ఈ నెల 24వ తేదీనీ వీరి నిశ్చితార్థం జరగనుంది. అక్టోబర్ తొలి వారంలో పెళ్లి జరగనుంది. వరుస విజయాలను అందుకుంటున్న నిఖిల్ ప్రస్తుతం ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.