: డ్రగ్ కింగ్ పిన్ కమింగ నోటి వెంట సంచలన నిజాలు... సినీ స్టార్స్, పొలిటికల్ లీడర్స్ పేర్లు వెల్లడి!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాదకద్రవ్యాల వ్యవహారంలో ఎక్సైజ్ సిట్ అత్యంత కీలక నిందితుడిగా భావిస్తున్న మైక్ కమింగా నోటి వెంట సంచలన నిజాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. సుమారు 1000 మందికి డ్రగ్స్ విక్రయించానని, తాను కూడా వాడేవాడినని ఇప్పటికే వెల్లడించిన కమింగా, మలి విచారణలో పలువురు సినీ స్టార్స్, రాజకీయ నాయకులు, ఐటీ సెక్టార్ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లను వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కమింగను మరింత లోతుగా విచారించాలని భావిస్తున్న సిట్ అధికారులు, అతని కస్టడీ ముగియడంతో, మరోసారి కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని భావిస్తున్నారు. కమింగ నుంచి డ్రగ్స్ వాడకందారుల జాబితాను అందుకున్న సిట్, అవసరమైతే వారిని కార్యాలయానికి పిలిపించాలని, లేకుంటే వారి వద్దకే వెళ్లి విచారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాలతో కమింగకు లింకులున్నాయని తెలుసుకున్న సిట్, విచారణలో ఇతర దేశాల పోలీసుల సాయం కూడా తీసుకోవాలని యోచిస్తోంది.