: 9 కిలోల బంగారంతో వెంకన్న కోసం తయారైన కొత్త వాహనమిది


తిరుమల శ్రీవారి వాహనాల్లో తాజాగా సరికొత్త సర్వభూపాల వాహనం వచ్చి చేరింది. ఇప్పటికే టీటీడీ వినియోగిస్తున్న సర్వభూపాల వాహనం బరువుగా ఉండటంతో పాటు, దానిలో ఆసీనులై ఊరేగింపుగా వెళుతున్న వేళ, భక్తకోటికి సరిగ్గా దర్శనం కావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా కొత్త వాహనాన్ని తయారు చేయించారు. 16 అడుగుల ఎత్తుగా తయారైన వాహనానికి 9 కిలోల బంగారంతో తాపడం పనులు చేయించారు. తమిళనాడుకు చెందిన కల్యాణ సుందరం అనే నిపుణుడైన కార్మికుడి ఆధ్వర్యంలో ఈ వాహనం తయారైంది. రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నూతన సర్వభూపాల వాహనంపై స్వామివారు తొలిసారి విహరించనున్నారు. ఆ వాహనం ఇదే!

  • Loading...

More Telugu News