: అందాల పోటీలో భార్య విజయం కోసం 'దొంగ' పని చేసి అడ్డంగా దొరికిపోయిన భర్త!


ఓ బ్యూటీ కంటెస్ట్ లో పాల్గొంటున్న తన భార్య విజయం సాధించాలన్న ఆశతో, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి సిగ్గుమాలిన పని చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన చత్తీస్ గఢ్లోని బిలాస్ పూర్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రమీలా గుప్తా అనే యువతి స్థానికంగా జరిగే ఓ అందాల పోటీలో పాల్గొనాలని నిర్ణయించింది. పోటీలకు వెళ్లే సమయంలో ఖరీదైన డిజైనర్ శారీ కట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయంతో, ఆమె భర్త శ్రీశాంత్, ఓ షోరూంలోకి వెళ్లి, చీరను దొంగిలించి తెచ్చాడు.

అంతవరకూ బాగానే ఉందికానీ, ఆమె సదరు చీర కట్టుకుని ర్యాంప్ పైకి ఎక్కగానే, పోటీలను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి, చీరను గుర్తు పట్టి, షోరూం యజమానికి సమాచారాన్ని అందించాడు. దీంతో షాపు యజమానితో పాటు పోలీసులు అక్కడికి రావడం, స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నించడం, తాను చేసిన తప్పును శ్రీశాంత్ ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ఓ ప్రభుత్వ టీచర్ గా ఉన్న తాను, భార్యకు అంత ఖరీదైన చీరను కొనివ్వలేనన్న ఉద్దేశంతోనే ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు అతను అంగీకరించగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News