: ఓవర్సీస్ లో 'ఫిదా' జోరు: నందమూరి రికార్డులతో పాటు పవన్ ఆల్ టైం రికార్డు మాయం!


తెలుగు సినీ ప్రేక్షకులను 'ఫిదా' చేసిన వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్, అన్ని మెగా రికార్డులను తిరగరాసింది. రెండో వారంలోనే నందమూరి హీరోలు ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఓవర్సీస్ రికార్డులను బద్దలు కొట్టిన 'ఫిదా', ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డును వరుణ్ ఒక్క ఫ్యామిలీ మూవీతో దాటేశాడని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి విదేశాల్లో 1.89 మిలియన్ డాలర్లు లభించాయి. ఇదే ఆయన సినీ చరిత్రలో హయ్యస్ట్ ఓవర్సీస్ గ్రాసర్. ఆపై వచ్చిన పవన్ సినిమాలు ఈ రికార్డును బ్రేక్ చేయలేదు. ఇక 'ఫిదా' మూడు వారాల్లోనే 1.91 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ టాప్-10 సినిమాల్లో 'ఫిదా' ప్రస్తుతం 7వ స్థానంలో ఉండగా, నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ నెక్ట్స్ టార్గెట్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లో 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 'ఫిదా' ఆ మార్కును దాటుతుందో లేదో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News