: ఆసుపత్రిలో బంగ్లా క్రికెటర్ మోర్తాజా.. రక్తపు వాంతితో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ మోర్తాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన నోటి వెంట ఒక్కసారిగా రక్తం కారడంతో, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త బయటకు పొక్కగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్) వైద్యుడు దిబాషిష్ చౌధురి వెల్లడించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో భాగంగా ఊపిరితిత్తులు పరిశీలించామని, అంతా నార్మల్ గానే ఉందని అన్నారు. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదని భావించిన మీదట ఇంటికి పంపించినట్టు తెలిపారు. నోటివెంట రక్తం ఎందుకు వచ్చిందన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.