: దంగల్ స్టార్ తో కలిసి షార్ట్ ఫిల్మ్ లో నటించిన కాజల్
బాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించాలని వెళ్లి, చతికిలపడిన కాజల్...మళ్లీ దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో తాజాగా ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించింది. రక్తదానం చేయాలనే ఇతివృత్తంతో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో కాజల్ తో పాటు 'దంగల్' స్టార్ (గీత, బబితల సోదరుడి పాత్రలో నటించిన) అపర్ శక్తి ఖురానా నటించడం విశేషం. నాలుగు నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.