: ప్రభాస్ తదుపరి చిత్రానికి అమిత్ త్రివేదీ స్వరాలు?
బాలీవుడ్‌లో ప్రఖ్యాత కంపోజర్‌గా పేరు సంపాదించుకున్న అమిత్ త్రివేదీ, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమాకి స్వరాలు సమకూర్చుతున్నట్లు సమాచారం. రొమాంటిక్ ఎంటరైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అమిత్ న్యాయం చేయగలడని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేదీ `ఉడ్తా పంజాబ్`, `డియర్ జిందగీ`, `లుటేరా` వంటి హిందీ సినిమాలకు స్వరాలు సమకూర్చారు.
ఇదిలా ఉండగా `బాహుబలి 2` తర్వాత ప్రభాస్ నటిస్తున్న `సాహో` చిత్రం గురించి పెద్దగా వివరాలు బయటికి రావడం లేదు. ఇంకా ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్‌కి సంబంధించి కూడా ఎలాంటి వివరాలు తెలియరాలేదు. `సాహో` చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ స్వరాలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్‌లుక్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసి, సినిమాపై అంచనాలను పెంచుతోంది.