: తనపై ఐసీసీ విధించిన టెస్ట్ నిషేధంపై కవిత రూపంలో స్పందించిన జడేజా
టీమిండియా ఆల్ రౌండర్ జడేజాపై ఐసీసీ ఒక టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తిలకరత్నేపై ప్రమాదకరంగా బంతిని విసిరిన నేపథ్యంలో, జడ్డూపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జడేజా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించాడు. "నేను మంచిగా మారాలనుకున్నప్పుడు... ప్రపంచం మొత్తం నన్ను సంచలనానికి కేంద్రబిందువుగా మార్చింది" అని ట్వీట్ చేశాడు.