: ముగిసిన అమర్నాథ్ యాత్ర.... గతేడాదితో పోల్చితే పెరిగిన యాత్రికుల సంఖ్య
40 రోజులుగా కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర సోమవారంతో ముగిసింది. ప్రారంభంలోనే యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడిచేసినా, బెదరకుండా తమ యాత్రను భక్తులు కొనసాగించారు. ఈ ఏడాది 2 లక్షల 60 వేల మంది భక్తులు అమర్నాథ్ను సందర్శించినట్లు తెలుస్తోంది. గతేడాది 2 లక్షల 20 వేల మంది మాత్రమే సందర్శించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యాత్రికుల సంఖ్య బాగా పెరిగింది.
కాగా, ఈ రోజుతో అమర్నాథ్ మంచు శివలింగం కనిపించే గుడిని మూసేస్తారు. తర్వాత జరిగే కార్యక్రమాలను పహ్లాగన్ ప్రాంతంలోని లిడ్డార్ నది వద్ద అక్కడి సాధువులు నిర్వహిస్తారు. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్రకు రక్షణ ఏర్పాట్లు సజావుగానే ఉన్నా జూలై 10న జరిగిన లష్కర్-ఎ-తొయిబా దాడిలో 8 మంది యాత్రికులు చనిపోయారు. అలాగే జూలై 16న జమ్మూ శ్రీనగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మరణించిన సంగతి తెలిసిందే.