: ఈ కేసు వల్ల నాకెలాంటి సమస్యలోస్తాయోనని భయపడకు!: కూతురు పోరాటానికి ధైర్యాన్ని ఇస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి


నడిరోడ్డుపై హర్యానా బీజేపీ చీఫ్‌ సుభాష్‌ బరాల కొడుకు వికాస్‌ బరాలా... ఒక యువతిని వేధించిన సంగతి తెలిసిందే. కారులో వెళ్తున్న యువతిని పూటుగా మద్యం తాగిన వికాస్ బరాలా, తన స్నేహితుడు ఆశిష్ తో కలిసి ఎస్యూవీలో వెంబడించి పలుమార్లు ఆపాలని హెచ్చరిస్తూ, నడిరోడ్డుపై అటకాయించి వేధింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. వారిపై కిడ్నాప్ సెక్షన్ ను నమోదు చేయలేదు. ఆ బాధితురాలు సీనియర్ ఐఏఎస్ అధికారి వీరేందర్ కుందు కుమార్తె కావడంతో ఈ విషయం ఇప్పుడు అక్కడ ఆహాట్ టాపిక్ అయింది. మరోపక్క బాధితురాలు వర్ణికా కుందు తన పోరాటం తీవ్రం చేశారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కుమారుడ్ని తన కుమార్తె ఢీ కొట్టనుండడంతో ఆయన ఆమెలో ధైర్యం నూరిపోశారు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ లో ఆయన తన కుమార్తెకు బహిరంగ లేఖ రాశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఈ విషయంలో నువ్వు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ కేసు ద్వారా ఒక ఐఏఎస్‌ అధికారిని అయిన నాకు ఎలాంటి సమస్యలు వస్తాయోనని నువ్వు అస్సలు ఆలోచించకు. నా జీవితానికి ఈ కేసును ముడిపెట్టుకొని భయపడకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్తులను విడిచిపెట్టకూడదు. వారికి శిక్షపడాల్సిందే'నని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News