: ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నామినేషన్ చెల్లదని ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి వేసిన నామినేషన్ చెల్లదని, అది నిబంధనల ప్రకారం లేదని టీడీపీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ వాడలేదని, అఫిడవిట్‌పై సంతకం చేసిన నోటరీ రెన్యువల్ కాలేదని, నోటరీగా సంతకం చేసిన తులసిరెడ్డి లైసెన్స్ 2013లోనే ముగిసిందని టీడీపీ లీగల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తన నామినేషన్‌పై వచ్చిన అభ్యంతరాల మీద రెండు గంటల్లోగా వివరణ ఇవ్వాలని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఈసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.