: జగన్ కు రాఖీ కట్టిన షర్మిల.. ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేసిన జగన్
వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. తనకు ఎంతో ఆత్మీయంగా తన చెల్లి రాఖీ కట్టిన ఫొటోను జగన్ ఈ సందర్భంగా ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. అక్కాచెల్లెమ్మలంతా ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.